ఒకే బడిలో చదువుతున్నా.. ఖాతాలు మారాయెలా? | - | Sakshi
Sakshi News home page

ఒకే బడిలో చదువుతున్నా.. ఖాతాలు మారాయెలా?

Jul 30 2026 12:45 AM | Updated on Jul 30 2026 12:45 AM

బేస్తవారిపేట ఎంపీపీ స్కూల్‌లో గుంటి స్వప్న, చిరంజీవి దంపతుల కుమారుడు చిస్లోన్‌ రెండో తరగతి చదువుతున్నాడు. గతేడాది ఒకటో తరగతిలో ఇదే బడిలో చదివినందుకు పూర్తిస్థాయిలో రూ.13 వేలు అందాయి. ఈ ఏడాది మాత్రం విచిత్రంగా స్వప్న ఖాతాలో రూ.3 వేలు మాత్రమే జమ చేసి, మిగతా రూ.10 వేలు సంబంధిత ప్రైవేట్‌ స్కూల్‌కు జమ చేస్తున్నట్లు మెసేజ్‌ వచ్చింది. ప్రైవేటు బడి ముఖమే చూడని తమకు ఈ సందేశం రావడంపై తలలు పట్టుకుంటున్నారు. దీనిపై హెచ్‌ఎంను నిలదీస్తే.. సచివాలయంలో తేల్చుకోండంటూ ఉచిత సలహా ఇచ్చారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement