బేస్తవారిపేట మండలం ఖాజీపురంకు చెందిన నాగేంద్ర, దివ్య దంపతుల కుమార్తె నిఖితకు ఏలూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఆర్‌టీఈ కింద సీటొచ్చింది. వారు స్వగ్రామానికి తిరిగి రావడంతో పాపను అక్కడే చేర్పించకుండా.. ఖాజీపురం ప్రభుత్వ పాఠశాలలో వేశారు. అయితే, ‘తల్లికి వందనం’ కింద దివ్య ఖాతాలో రూ.1,500 మాత్రమే జమయ్యాయి. మిగతా సొమ్ము ఆ ఏలూరు ప్రైవేట్ స్కూల్‌కు జమ చేస్తున్నట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అసలు చదవని బడికి డబ్బులెలా వెళ్తాయని ఎంఈఓ, హెచ్‌ఎంల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదని ఆ దంపతులు ఆవేదన చెందుతున్నారు.


