సైనికుల త్యాగాలు మరువం | - | Sakshi
Sakshi News home page

సైనికుల త్యాగాలు మరువం

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

మార్కాపురం:

దేశ రక్షణకోసం సైనికుల త్యాగాలను మరువమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు అన్నారు. కార్గిల్‌డేను పురస్కరించుకుని ఆదివారం మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తర్లుపాడు రోడ్డులోని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను గుర్తుచేసుకోవాలని, వారి త్యాగాలను మర్చిపోవద్దన్నారు. యువతలో దేశభక్తి ఉండాలన్నారు. నెల్లూరు పార్లమెంట్‌ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కూడా అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శీలం హరినారాయణరెడ్డి, చిన్నయ్య, శేషసాయి, సతికల రామకృష్ణ, న్యాయవాదులు భూపని కాశయ్య, చౌడేశ్వరరావు, వెంకటేశ్వర రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టరు నల్లబోతుల కొండయ్య, కాంట్రాక్టరు గాయం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ

నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement