ఆశలకు కోత ! | - | Sakshi
Sakshi News home page

ఆశలకు కోత !

Jul 26 2026 7:54 AM | Updated on Jul 26 2026 7:54 AM

● ఒంగోలు రీజియన్‌లో 39.05 మిలియన్‌ కేజీల ఉత్పత్తికి కోత ● కర్నాటకలో పెరిగిన ఉత్పత్తి పరిమితి ● ఏపీ రైతులకు మాత్రం నిరాశ ● పంట నియంత్రణ చర్యల్లో భాగమంటున్న బోర్డు అధికారులు 2026–27 పంట సీజన్‌కు పొగాకు పరిమితి

న్యూస్‌రీల్‌

27న కనిగిరిలో పోలీసు పీజీఆర్‌ఎస్‌

డీపీఆర్‌ఓగా సందీప్‌

భార్యపై కోపంతో పసిమొగ్గలను చిదిమేయచూసిన తండ్రి ఎలుకల మందు కలిపిన డ్రింక్‌ను ఆశగా తాగిన చిన్నారులు మృత్యువుతో పోరాడి ఓడిన కుమార్తె.. ప్రాణాపాయ స్థితిలో కుమారుడు

కన్నతండ్రే కాలయముడై..

ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026

గిట్టుబాటు ధర కల్పించడంలో

విఫలమైన టుబాకో బోర్డు ఇప్పుడు రైతులపై మరో భారం మోపింది.

ధరల కోసం మూడు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని బోర్డు.. 2026–27 సీజన్‌కు ఒంగోలు రీజియన్‌లో పొగాకు సాగు పరిమితిని భారీగా కుదించింది. ఈ సీజన్‌తో పోలిస్తే 39.05 మిలియన్‌ కేజీల

ఉత్పత్తికి కోత విధించి, 51.15

మిలియన్‌ కేజీలకే అనుమతి ఇవ్వడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు కర్నాటకలో మాత్రం ఉత్పత్తి భారీగా పెరగడం గమనార్హం.

వచ్చే సీజన్‌కు 51.15 మిలియన్‌ కేజీలకే టుబాకో బోర్డు అనుమతి

కందుకూరు:

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గిట్టుబాటు ధరలు లభించక ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, టుబాకో బోర్డు వ్యాపారులకు మద్దతుగా నిలిచాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మద్దతు ధర కోసం ఆందోళనలు చేస్తున్నా ధరలు మాత్రం పెరగడంలేదు. ఇదిలా ఉండగా 2026–27 పంట సీజన్‌కు సంబంధించిన పరిమితిని బోర్డు భారీగా తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా 81 మిలియన్‌ కేజీల పొగాకు పండించేందుకు అనుమతి ఉంటే అదే ఒంగోలు రీజియన్‌ (ప్రకాశం, నెల్లూరు జిల్లాలు)లోని 11 వేలం కేంద్రాల పరిధిలో 51.15 మిలియన్‌ కేజీల పొగాకును పండించేందుకు అనుమతిచ్చింది. జిల్లాలో ప్రధానంగా ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి, వెల్లంపల్లి వేలం కేంద్రాలు దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలుగా (ఎస్‌బీఎస్‌) ఉన్నాయి. వీటి పరిధిలో 27.56 మిలియన్‌ కేజీల పండించవచ్చు. దక్షిణ ప్రాంత తేలిక నేలలు(ఎస్‌ఎల్‌ఎస్‌) ఉన్న పొదిలి, కందుకూరు–1, కందుకూరు–2, కనిగిరి, నెల్లూరు జిల్లా కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో 23.59 మిలియన్‌ కేజీలను పండించేందుకు బోర్డు అనుమతి ఉంది. దీని ప్రకారం రీజియన్‌ పరిధిలో 2026–27 పంట సీజన్‌కు సంబంధించి 51.15 మిలియన్‌ కేజీల పొగాకును పండించవచ్చు. ఈ మేరకు బ్యారన్‌ పరిధిలో ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేయాలి, ఎన్ని క్వింటాళ్లు పండించాలనే పరిమితులను కూడా నిర్దేశించింది. దీని ప్రకారం ఎస్‌బీఎస్‌ పరిధిలో 2.50 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగుకు అనుమతి ఉండగా 20 క్వింటాళ్లు పండించవచ్చు. ఎస్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 3.50 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేసి 21 క్వింటాళ్లు పొగాకు ఉత్పత్తులను పండించవచ్చని బోర్డు పరిమితి విధించింది.

39.05 మిలియన్‌ కేజీల కోత

2025–26 పంట సీజన్‌లో ప్రకాశం రీజియన్‌ పరిధిలో 90.20 మిలియన్‌ కేజీల పొగాకును పండించేందుకు బోర్డు అనుమతి ఉంది. 2026–27 సీజన్‌కు దాన్ని 51.15 మిలియన్‌ కేజీలకు తగ్గించింది. అంటే దాదాపు 39.05 మిలియన్‌ కేజీల పొగాకు పంటకు కోత పెట్టింది. దీనికి ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభమే ప్రధాన కారణమని బోర్డు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో 90.20 మిలియన్‌ కేజీల పొగాకు పండించాల్సి ఉంటే దాదాపు 140 మిలియన్‌ కేజీల వరకు పండించినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని వ్యాపారులు సాకుగా చూపి ధరల్లో భారీగా కోత విధిస్తున్నారు. పైగా ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ధరలు అమాంతం పడిపోతుండడంతో గత్యంతరం లేని పరిస్థితిలో పొగాకును తెగనమ్ముకుంటున్నారు. వేలం ప్రారంభమై మూడు నెలలు దాటుతున్నా 33 మిలియన్‌ కిలోలు మాత్రమే అమ్ముడైంది. వేలం కేంద్రాలకు వస్తున్న బేళ్లలో అధిక శాతం తిరస్కరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రాంతం పంట పరిమితి బ్యారన్‌ ఆమోదిత సాగు విస్తీర్ణం

(మిలియన్‌ కేజీలు) కోటా (కేజీలు)

1.ఎస్‌బీఎస్‌ 23.59 2000 2.50 ఎకరాలు

2.ఎస్‌ఎల్‌ఎస్‌ 27.56 2100 3.50 ఎకరాలు

3.ఎన్‌ఎల్‌ఎస్‌ 28.27 2000 2.00 ఎకరాలు

4.ఎన్‌బీఎస్‌ 1.60 1600 1.75 ఎకరాలు

మార్కాపురం: ఈనెల 27న కనిగిరి పోలీసు స్టేషన్‌లో పోలీసు పీజీఆర్‌ఎస్‌ను నిర్వహిస్తున్నట్టు ఇన్‌చార్జి ఎస్‌పీ వీ హర్షవర్ధన్‌రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పీజిఆర్‌ఎస్‌ నిర్వహిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరారు.

మార్కాపురం టౌన్‌: మార్కాపురం జిల్లా డీపీఆర్‌ఓగా డీ సందీప్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ విజయసునీతకు మొక్క అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈయన చిత్తూరు జిల్లా నుంచి బదిలీపై మార్కాపురం జిల్లాకు వచ్చారు.

కర్ణాటకలో మళ్లీ భారీగా ఉత్పత్తి

రాష్ట్రంలో ధరల్లేక పొగాకు సాగుపై టుబాకో బోర్డు పరిమితులు విధిస్తుంటే మన కంటే ముందుగా సీజన్‌ ప్రారంభమయ్యే కర్ణాటకలో 2026–27 పంట సీజన్‌కు 56 మిలియన్‌ కేజీల పొగాకును పండించేందుకు బోర్డు అనుమతి ఉంటే అక్కడి రైతులు దాదాపు 100 మిలియన్‌ కేజీల ఉత్పత్తులను పండించినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో నెలా, రెండు నెలల్లో అక్కడి ఈ ఏడాది వేలం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ప్రభావం కూడా ఇక్కడి పొగాకు రైతులపై భారీగా పడనున్నట్టు అధికారులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement