మేదరమెట్ల: మేదరమెట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బైక్‌పై వస్తున్న యువకులు ఢీకొట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇరువురిలో వల్లెపు ప్రదీప్(24) అక్కడికక్కడే మృతి చెందగా, మాచర్ల భార్గవ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని, క్షతగాత్రుణ్ణి 108 లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేదరమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరులోని ఓ విద్యా సంస్ధలో ప్రదీప్, భార్గవ్‌లు చుదువుతున్నారు. ప్రదీప్‌ది విజయవాడ. భార్గవ్‌ది విజయనగరం. ఇద్దరూ బైక్‌పై ఒంగోలు వచ్చి తిరిగి గుంటూరు వెళ్లే క్రమంలో మేదరమెట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ముందు వెళుతున్న లారీని ఢీకొట్టి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ప్రదీప్ మృతి చెందాడు. గాయపడిన భార్గవ్‌ను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు, బడి నిర్వహణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు జూలై 24న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) 4.0ను నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఏపీసీ దాసరి అనీల్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 38 మండలాల పరిధిలో గల 1,556 ప్రభుత్వ పాఠశాలలు, 1,405 మోడల్ ప్రాథమిక పాఠశాలలు.. వెరసి మొత్తం 2,961 బడుల్లో ఈ మెగా పీటీఎం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్ల కోసం రూ.66.33 లక్షల నిధులను వెచ్చించినట్లు ఏపీసీ వివరించారు.
ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు


