టంగుటూరు: టంగుటూరు టోల్‌ప్లాజాలో ఓవర్ లోడు ఫీజు వసూలుతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. రేయింబవళ్లు ఇరువైపులా కిలోమీటర్లకు మేర వాహనాలు నిలిచిపోతుండటంతో అత్యవసర పనులపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రులకు వెళ్లే వారు వాహనాలు నిలిచిపోయిన సమయంలో పడే ఇక్కట్లు చెప్పేవీ కావు. గతంలో ట్రాఫిక్‌లో అంబులెన్సు ఇరుక్కొని 30 నిముషాలు పాటు రోగి, బంధువులు అల్లాడిపోయారు. ఆ సమయంలో అంబులెన్సులోని వ్యక్తి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని వాహనదారులు అధికారులను నిలదీశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
మారని టోల్ ప్లాజా యాజమాన్యం తీరు..
ఓవర్ లోడ్ పేరుతో వసూలు చేస్తుండడంతో ప్రతిరోజు గంటలకొద్దీ ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిత్యం ఇదే తీరు. ఈ ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాహనదారులు కష్టాలు చెప్పేవి కావు. ఇంత జరుగుతున్న టోల్ ప్లాజా యాజమాన్యం తీరు మార్చుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఓవర్ లోడు వసూలు పేరుతో టోల్‌ప్లాజా వద్ద వాహనాల నిలిపివేత
కిలోమీటర్ మేర నిలిచిపోతున్న వాహనాలు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న
వాహనదారులు


