మార్కాపురం టౌన్: అభివృద్ధిలో వెనుకబడిన మార్కాపురం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విజయసునీతకు వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విజయ సునీతను బుధవారం మాజీ ఎమ్మెల్యే అన్నాతోపాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీర్జా షంషేర్ ఆలీబేగ్, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ షేక్ సలీమ్, కార్యదర్శి సత్యంరెడ్డి, మార్కాపురం, కొనకనమిట్ల మండలాలకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు.
కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విజ్ఞప్తి


