భారీ ఎత్తున మొహరించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

భారీ ఎత్తున మొహరించిన పోలీసులు

Apr 9 2026 8:11 AM | Updated on Apr 9 2026 8:11 AM

భారీ ఎత్తున మొహరించిన పోలీసులు

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్లే దారిలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించి హంగామా సృష్టించారు. బ్యారికేడ్లను అడ్డం పెట్టారు. మహిళా నాయకురాళ్లను బ్యారికేడ్లు దాటి వెళ్లకుండా అడ్డుకున్నారు. పాత చీరాల రోడ్డులో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించి హడావుడి చేశారు. తొలుత ఒంగోలు ఇన్‌చార్జి చుండూరి రవిబాబు నేతృత్వంలో పలువురు నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకుని అక్కడ నుంచి బలవంతంగా పంపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement