పకడ్బందీగా పది పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పది పరీక్షలు

Mar 24 2026 6:57 AM | Updated on Mar 24 2026 6:57 AM

పకడ్బందీగా పది పరీక్షలు విద్యుదాఘాతానికి వృద్ధురాలి మృతి

డీఈఓ రేణుక

పొన్నలూరు: జిల్లాలో పదో తరగతి పరీక్షలను ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లోని పరీక్షా కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేసి పరీక్ష నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకెళ్లకుండా ప్రతి రోజూ తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. మాస్‌ కాపీయింగ్‌ వంటివి లేకుండా పర్యవేక్షకులు గట్టి నిఘా ఉంచారన్నారు. అలాగే పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలు చేసి బయట వ్యక్తులు వెళ్లకుండా పరిక్ష ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశామన్నారు. ఆమె వెంట పరీక్ష కేంద్రం చీఫ్‌ అనురాధ ఉన్నారు.

కంభం: విద్యుదాఘాతానికి వృద్ధురాలి మృతి చెందింది. ఈ ఘటన మండలంలో యర్రబాలెం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మద్దిరాల గంగమ్మ(60) ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుంచి పొలానికి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో పొలంలోకి వెళ్లి వెతకగా స్టాటర్‌ పెట్టే వద్ద విద్యుతాఘాతానికి గురై పడి ఉంది. విషయం తెలుసుకున్న విద్యుత్‌ శాఖాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement