ఎవరికీ ‘చెప్పు’కోలేక..! | Poor Quality School Kits Spark Concerns In Andhra Pradesh Government Schools, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఎవరికీ ‘చెప్పు’కోలేక..!

Mar 26 2026 2:00 PM | Updated on Mar 26 2026 2:53 PM

TDP Govt Negligence On Government School Students

బూట్లకు బదులు చెప్పులతో వెళ్తున్న ఒంగోలు పీవీఆర్‌ బాలికల హైస్కూల్‌ విద్యార్థులు

సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో గడిచిన రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న ఘటనల తీవ్రత తగ్గించేందుకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇటీవల కాలంలో బడిబాట పట్టి తిమ్మిని బమ్మి చేసేందుకు యత్నించారు. 

వాస్తవానికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతోపాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద నాణ్యమైన కిట్లు పంపిణీ చేశారు. వాటిని విద్యా మిత్ర కిట్లుగా పేరు మార్చిన చంద్రబాబు సర్కారు నాణ్యతను గాలికొదిలేసింది. పంపిణీ చేసిన రోజుల వ్యవధిలోనే బ్యాగులు చినిగిపోయి, బూట్లు దెబ్బతిన్నాయి. విద్యార్థులు డబ్బు వెచ్చించి బ్యాగులు కొనుగోలు చేయడంతోపాటు బూట్లకు బదులు చెప్పులు వేసుకుని పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితి. సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక సర్దుకుపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.  

విద్యా మిత్ర కిట్‌లో ఇచ్చిన బ్యాగులు చినిగిపోవడంతో సొంత బ్యాగులతో ఇలా..   

                 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement