పెళ్లిలో ఎలాంటి మార్పు లేదు.. భోజ‌నాల్లేవంతే! | Manyam District Variety Wedding Card Went Viral On Social Media Amid LPG Shortage Over US-Iran Conflict | Sakshi
Sakshi News home page

పెళ్లిలో ఎలాంటి మార్పు లేదు.. భోజ‌నాల్లేవంతే!

Mar 26 2026 12:15 PM | Updated on Mar 26 2026 1:16 PM

Variety Wedding Card Viral in Manyam District

 నెట్టింట వైరల్‌ అవుతోన్న పెళ్లి శుభలేక  

పార్వతీపురం మన్యం జిల్లా: అమెరికా–ఇరాన్‌ మధ్య కొద్ది రోజులు గా జరుగుతున్న యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత వల్ల చాలా ప్రాంతాల్లో హోటళ్లు మూతబడుతున్నాయి. హాస్టళ్లలో భోజనానికి ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులను గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివాహం జరిగితే ఇలా ఉంటుందోనని తెలియజేస్తూ ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక వెరైటీ ఉంది. 

ఆ వివరాలు ఇలా ఉన్నాయి..  
ప్రస్తుతం జరుగుతన్న యుద్ధం వల్ల వివాహ కార్యక్రమాల్లో ఎటువంటి మార్పు లేదని, కావున బంధు, మిత్రులు అందరూ వివాహ కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలని కోరుతున్నాం. గ్యాస్‌ సిలిండర్లు కొరత వల్ల కేవలం భోజనం ఏర్పాట్లు మాత్రమే రద్దు చేయబడ్డాయి. మిగిలిన కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. కానుకలు ఇచ్చేవారు నిరభ్యంతరంగా ఇవ్వొచ్చు.. వాటిపై ఎటువంటి ఆంక్షలు లేవు.. మీరంతా కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను దీవించవలసినదిగా కోరుతున్నాము. మీ కోసం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాం.. గమనించగలరు ధన్యవాదాలు అంటూ.. ఆహ్వానించగా దానికి బదులుగా బందువులు ఈ విధంగా బదులిచ్చారు.. 

ఆహ్వానించినందుకు ధన్యవాదాలు... 
మా కారు గ్యాస్‌తో నడుస్తుంది.. ప్రస్తుతం గ్యాస్‌ కొరత వల్ల కారు కదిలేలా లేదు. కాబట్టి మేము పెళ్లికి రాలేకపోతున్నాం.. మీ కార్యక్రమాన్ని యథా విధిగా కానివ్వండి.. వధూవరులకు మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఆహ్వాన పత్రిక చూసిన వారంతా ట్రెండ్‌కు తగ్గుట్టుందని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

   

Advertisement
 
Advertisement
Advertisement