పని చేసి అలసిన ఓ బాలుడు వేగంగా దూసుకెళ్తున్న వాహనంపై మండుటెండలో నిద్రిస్తున్న దృశ్యాన్ని చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై ఒంగోలు శివారులోని త్రోవగుంట వద్ద ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. ఓ లోడ్ ట్రక్ అంచున ప్రమాదకర స్థితిలో నిద్రిస్తున్న బాలుడు.. అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులందరి దృష్టిని ఆకర్షించాడు. ట్రక్ గమ్యస్థానానికి చేరుకునేలోపు ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశమైంది. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి. – సాక్షి, ఒంగోలు


