రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Mar 24 2026 6:57 AM | Updated on Mar 24 2026 6:57 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

సంతమాగులూరు (అద్దంకి రూరల్‌): బైకు మీద వెళుతున్న యువకుడిని బోలెరొ వాహనం ఢీకొట్టగా మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..బతుకుదెరువు నిమిత్తం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుంచి వలస వచ్చిన రోహిత్‌ (22) సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్‌లో వెళుతుండగా వినుకొండ నుంచి నరసరావుపేట వెళుతున్న అరటికాయల లోడు వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో రోహిత్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.

జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి

ఒంగోలు సబర్బన్‌:

ర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అన్నారు. స్థానిక ప్రకాశం భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 278 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలను నాణ్యతతో, సత్వరం పరిష్కరించేలా చూడాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లీనిక్‌ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌ రెడ్డి, మాధురి, విజయజ్యోతి, డీపీఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement