గ్యాస్ మంట..
ఒంగోలు నగరం బాలాజీనగర్‌లో ఇంటి బయట కట్టెలపొయ్యితో వంటలు చేసుకుంటున్న మహిళలు
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత హోటళ్లు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కర్రీపాయింట్‌లు, హోటళ్లలో ఒక్కసారిగా ధరలు పెంచేశారు. ధరలు పెంచినట్లు బోర్డులు పెట్టారు. చాలా వరకు హోటళ్ల వారు గ్యాస్ పొయ్యిల బదులు కట్టెల పొయ్యికి మారిపోయారు. కొన్ని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కర్రీపాయింట్‌లు, హోటళ్లను మూసేశారు. కొన్ని ఇళ్లలోనూ గ్యాస్‌స్టవ్‌లకు బదులు ఆరుబయట కట్టెలపొయ్యిపై వంట చేసుకుంటున్నారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
– సాక్షి, ఒంగోలు


