వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు: రాంబాబు
పొదిలి: కూటమి ప్రభుత్వంలో కష్టపడుతూ, నష్టపోతూ ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తించి తగిన ప్రతిఫలం వచ్చేలా చేసేందుకు వైఎస్.జగన్‌మోహనరెడ్డి నిర్ణయించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి ఏలూరు ముసి ఆంజనేయస్వామి వార్షిక తిరునాళ్ల సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా శివప్రసాదరెడ్డితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మార్కాపురం ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్ జగన్‌మోహనరెడ్డి నిలిచారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కార్యకర్తలు, పేదలు సంకల్పం తీసుకున్నారన్నారు. పార్టీలో ఉంటూ పార్టీ వారినే వెన్నుపోటు పొడిచేందుకు కాచుకు కూర్చున్న వారిపై చర్యలు తప్పవన్నారు. మార్కాపురం ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు మాట్లాడుతూ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడమే అజండాగా కూటమి నేతలు పని చేస్తున్నారన్నారు. ఎదురవుతున్న కష్టాలను అనుభవిస్తూనే, జగనన్న కోసం పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధమవుతున్నారన్నారు. కార్యకర్తలకు వచ్చే ఇబ్బందులను, సమస్యలను పరిష్కారం చేసేందుకు తాము అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో అన్నా కృష్ణ చైతన్య, రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణారెడ్డి, మాజీ ఏఎంసీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, గొలమారి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ సలహామండలి మాజీ అధ్యక్షుడు కొండ్రగుంట సుబ్బారావు, అన్నవరం బ్రహ్మారెడ్డి, ఉప్పలపాడు మాజీ ఎంపీటీసీ కొణతం రమణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బూచి నాగిరెడ్డి, ఏలూరు, ఓబులక్కపల్లి, పాములపాడు, అక్కచెరువు, ఆముదాలపల్లి, మల్లవరం, రామాపురం సర్పంచ్‌లు తాల్లూరి సింగయ్య, ఆవుల వెంకట సుబ్బారెడ్డి, కోదండరామిరెడ్డి, గొంటు సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, రెడ్డెబోయిన వెంకటేశ్వర్లు, కసిరెడ్డి కోటిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు కొండ్రగుంట శ్రీనివాసరావు, పూనె చిన వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కొండాయపాలెం నారాయణరెడ్డి, మూగ చింతల రామాంజనేయరెడ్డి, గురుగుపాడు నారాయణరెడ్డి, ఈగలపాడు యోగిరెడ్డి, రామిరెడ్డి, మండలంలోని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


