గంగమ్మ తల్లి తిరునాళ్లకుప్రభ ఏర్పాటుకు టెంకాయ కొట్టిన బూచేపల్లి, మేరుగు
చీమకుర్తి రూరల్: మండలంలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తిరునాళ్లకు సంబంధించి వైఎస్సార్ సీపీ ప్రభ పనులు ప్రారంభించడానికి శ్రీమోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్చి 31వ తేదీ చీమకుర్తిలో మందిరాలు, ఏప్రిల్ 1వ తేదీ రామతీర్థం పుణ్యక్షేత్రంలో గంగమ్మ తల్లి తిరునాళ్ల నిర్వహిస్తారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గంగమ్మతల్లి ఆలయంలో టెంకాయలు కొట్టి ప్రభ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో చీమకుర్తి పట్టణ పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్‌రెడ్డి, జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజీవ్, చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు చీదర్ల శేషు, యన్నం శేషురెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పొన్నపల్లి నాగేశ్వరరావు పిన్నిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల వలంటరీ వింగ్ అధ్యక్షుడు చౌడారెడ్డి, కౌన్సిలర్ శేషాద్రి, నల్లూరి చంద్ర, ప్రతాప్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఉప్పలపాటి వెంకటరావు, ప్రసాదరెడ్డి, చంద్ర, చిన్నికృష్ణ, లక్ష్మిరెడ్డి, అన్ను రాంబాబు, మక్కెన రాజేంద్ర, రావి లక్ష్మయ్య, ఖజా తదితరులు పాల్గొన్నారు.


