ఒంగోలు వన్‌టౌన్: ఒంగోలులోని రెడ్డి హాస్టల్లో రూ.2.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు రెడ్డి హాస్టల్లో గురువారం రాత్రి నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైవీ భద్రారెడ్డి మాట్లాడుతూ సమాజానికి మంచి చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పెద్దలు, దాతలను కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రొఫెసర్ డి.వెంకటేశ్వరరెడ్డి, హాస్టల్ కార్యదర్శి ఆదిరెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


