ఒంగోలు సిటీ: ముస్లిం సోదర, సోదరీమణులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు, కొండపి, సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్‌లు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు బుర్రా మధుసూదన్ యాదవ్, అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, కనిగిరి, ఒంగోలు, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు దద్దాల నారాయణ యాదవ్, చుండూరి రవిబాబు, డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్‌లు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
టంగుటూరు: సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టంగుటూరు టోల్ ప్లాజాలో ఓవర్ లోడ్ ఫీజులు వసూలు చేసే క్రమంలో ప్రతి రోజూ ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. వాహదారులు, అత్యవసర పనుల నిమిత్తం పోయే వారు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ ఇరుక్కుపోయింది. టంగుటూరు వైపు నుంచి ఒంగోలుకు అత్యవసర స్థితిలో ఉన్న రోగిని తరలించే క్రమంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత వలన ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడటానికి సుమారు 30 నిమిషాలు పట్టింది. నిత్యం ఇదే తీరు కొనసాగుతోంది. అధికారులు స్పందించి టోల్ ప్లాజా యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.


