గ్రామీణులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామీణులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం

Mar 19 2026 7:31 AM | Updated on Mar 19 2026 7:31 AM

గ్రామీణులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం బీకేవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల పరిశీలన

అద్దంకి రూరల్‌: అద్దంకి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అద్దంకి ఆరోగ్య రథాన్ని ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్‌ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అద్దంకి ఆరోగ్య రథం లోగోను బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అశోక్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రథం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ప్రజలకు ప్రాథమిక పరీక్షలు చేసి చికిత్స అందిస్తారని చెప్పారు. అలాగే ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే అద్దంకి అభివృద్ధి చెందుతుందని డాక్టర్‌ అశోక్‌కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

తాళ్లూరు: బెంగళూరు–కడప–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవేకు సంబంధించి తాళ్లూరు మండలంలో చేపడుతున్న పనులను జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి బుధవారం పరిశీలించారు. హైవేకు అదనంగా భూమి అవసరమని గుర్తించారు. తాళ్లూరు గ్రామంలో 2.28 ఎకరాలు, మల్కాపురం గ్రామంలో 14 సెంట్ల భూమి అవసరమని అధికారులు జేసీ దృష్టికి తీసుకురాగా, భూ రికార్డులు పరిశీలించారు. నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించారు. రైతుల భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో అద్దంకి ఆర్డీఓ జాన్సన్‌, తహసీల్దార్‌ బీవీ రమణారావు, ఎక్స్‌ప్రైస్‌ హైవే ఎస్‌డీసీ, వీఆర్‌ఓ చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement