ఫ్లెక్సీల తొలగింపులో పక్షపాతం | - | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీల తొలగింపులో పక్షపాతం

Mar 19 2026 7:31 AM | Updated on Mar 19 2026 7:31 AM

దర్శి: దర్శిలో ఫ్లెక్సీల తొలగింపులో నగర పంచాయతీ కమిషనర్‌ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించి టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకుండా పక్షపాతం చూపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..రంజాన్‌ పండుగ సందర్భంగా పట్టణంలో ముస్లింలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలలో రాజకీయ పార్టీ నాయకులు ఫొటోలు ఉన్నాయని, రోడ్డుకు అడ్డం లేకున్నా ఫ్లెక్సీలను తొలగించారని ముస్లింలు పడ్డారు. ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీల తొలగిస్తుండటంతో అక్కడకు చేరుకున్న ముస్లింలు కమిషనర్‌ శ్రీరామ్మూర్తితో మాట్లాడారు. గడియార స్తంభానికి అడ్డంగా నడిరోడ్డులో ఉన్న టీడీపీ నాయకులు, రాజకీయ నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు కడితే వాటిని ఎందుకు తీసివేయలేదని ప్రశ్నించారు. దీంతో కమిషనర్‌ మాట్లాడుతో రోడ్డుకు అడ్డంగా ఉందని, ఇక్కడ ఎవరు కట్టినా తీసేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రోడ్డుకు అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు ఎందుకు తీయలేదని, వారికి ఉన్న పర్మిషన్లు చూపించాలని కోరారు. దీనిపై కమిషనర్‌ మాట్లాడుతూ నాకు ఎటువంటి పార్టీలు లేవని చెబుతూనే వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీలు మాత్రమే తొలగించి టీడీపీ ఫ్లెక్సీలను అక్కడే ఉంచారు. దీనిపై స్థానికులు కమిషనర్‌ను నిలదీయంగా..వారికి అనుమతులు ఉన్నాయని చెప్పారు. అనుమతులు చూపించాలని ప్రశ్నించగా కమిషనర్‌ అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై కమిషనర్‌ను వివరణ కోరగా నగదు చెల్లించి అనుమతులు తీసుకుంటే ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీలు మాత్రమేతొలగింపు

కమిషనర్‌ తీరుపై స్థానికుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement