ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడం కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడం కూల్చివేత

Dec 18 2025 7:27 AM | Updated on Dec 18 2025 7:27 AM

ప్రభు

ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడం కూల్చివేత

కనిగిరి రూరల్‌:

ప్రభుత్వ, ఆర్‌అండ్‌బీ స్థలంలో ఓ పత్రికా విలేకరి(సాక్షి కాదు) నిర్మించిన అక్రమ కట్టడాన్ని రెవెన్యూ, అర్‌అండ్‌బీ, మున్సిపల్‌ అధికారుల బృందం బుధవారం రాత్రి కూల్చివేసింది. స్థానిక ఆర్‌అండ్‌బీ ఆఫీస్‌ సమీపంలోని హరిజనవాడలో ఓవీ రోడ్డుకు ఆనుకుని ఉన్న సుమారు 2 సెంట్ల స్థలంపై గత కొతం కాలంగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీనిపై ఇరువర్గాల వారు కోర్టును ఆశ్రయించారు. ఓ వర్గం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కూడా ఆశ్రయించింది. వారి తాజా ఉత్తర్వ్లుతో ఆ స్థలంలో కట్టడాన్ని తొలగించేందుకు అధికారులకు చర్యలు చేపట్టారు.

ఈ విషయమై తహసీల్దార్‌ నర్రా జయలక్ష్మి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పొరంబోకు స్థలంలో ఎ.నాగకుమార్‌ చేపట్టిన అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీకి చెందిన 6 అంకణాల స్థలంలో నిర్మాణాన్ని తొలగించాం. అక్రమ కట్టడాన్ని పూర్తిగా తొలగిస్తాం. గత కొంత కాలంగా ఆ భూమిపై నాగకుమార్‌, పంతగాని కొండమ్మ వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. హరిజనవాడలో గల స్థలం తమదని, దానిపై తమకు పూర్తి హక్కు పత్రాలున్నాయని పంతగాని కొండమ్మ, ముద్దా రమా హైకోర్టులో కేసు వేయడంతోపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. నాగకుమార్‌ కూడా తనకు పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఉందని హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. దీనిపై తాము విచారణ చేపట్టగా అసలు ఆ భూమిలో ఎవరికీ పట్టా ఇవ్వలేదని తేలింది. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ పొరంబోకు స్థలంగా ఉంది. చాలా ఏళ్ల నుంచి అక్కడ ఎస్సీలు నివసిస్తుండటంలో హరిజనపాలెంగా పిలుస్తున్నారు. గత తహసీల్దార్‌ రవికుమార్‌ 2025 జూన్‌లో నాగకుమార్‌కు 2 సెంట్లలో పీసీ( పొజిషన్‌ సర్టిఫికెట్‌) ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ భూమిలోకి ఎవరూ వెళ్లకుండా రెండు వర్గాలకు చెందిన వారిని బైండోవర్‌ చేశాం. మున్సిపల్‌ పరిధిలోని స్థలానికి పట్టా ఇచ్చేందుకు తహసీల్దార్లకు అనుమతి లేదు. ఆర్డీఓ ఆదేశాల మేరకు నాగకుమార్‌కు ఇచ్చిన పొజిషన్‌ సర్టిఫికెట్‌ రద్దయింది. నాగకుమార్‌ రెండ్రోజుల క్రితం శ్లాబ్‌ నిర్మాణం చేపట్టడంతో ఎస్సీఎస్టీ కమిషన్‌, అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నాం’ అని వివరించారు.

ఇదే అంశమై ఆర్‌అండ్‌బీ ఏఈ ఫిరోజ్‌ మాట్లాడుతూ.. నాగకుమార్‌ ఆర్‌అండ్‌బీ స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టారు. గతంలో మార్కింగ్‌ ఇచ్చాం. కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ స్థలంలో చేపట్టిన నిర్మాణం వరకు తాము పూర్తిగా తొలగిస్తాం. మిగతా కట్టడం విషయం రెవెన్యూ, మున్సిపల్‌ శాఖ పరిధిలో ఉంది.

హైకోర్టు, ఎస్సీఎస్టీ కమిషన్‌ ఆదేశాల మేరకు చర్యలు

ప్రస్తుతం కొంత మేర శ్లాబ్‌ తొలగింపు

అక్రమ కట్టడాన్ని పూర్తిగా తొలగిస్తామన్న తహసీల్దార్‌

ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడం కూల్చివేత 1
1/1

ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడం కూల్చివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement