
ప్రభుత్వ న్యాయవాదిగా శ్రీకాంత్
ఒంగోలు: ప్రభుత్వ న్యాయవాదిగా జి.శ్రీకాంత్ నియమితులయ్యారు. ఆ మేరకు లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్ ప్రభుత్వ కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన శ్రీకాంత్.. న్యాయవాద విద్య పూర్తిచేసి ఒంగోలులో 1997లో ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, రెండుసార్లు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. తాజాగా ప్రభుత్వ న్యాయవాదిగా జిల్లా కోర్టులో విధులు నిర్వహించేందుకు ఆయన నియమితులయ్యారు. మూడు సంవత్సరాల పాటు ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు.
మార్కాపురం: మార్కాపురం పట్టణంలో రెండు బైకులు చోరీ అయిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక విద్యానగర్‌కు చెందిన తిరుమలరెడ్డి రామాంజనేయరెడ్డి గురువారం రాత్రి తన ఇంటిముందు బైకును పార్క్ చేసి మరుసటిరోజు ఉదయం చూసుకునేసరికి కనిపించలేదు. అలాగే పట్టణంలోని పదో వార్డు జగదీశ్వరి థియేటర్ ప్రాంతంలో పఠాన్ ఉమర్‌ఖాన్‌కు చెందిన బైకు కూడా ముందు రోజు ఇంటిముందు పార్క్ చేసి శుక్రవారం నిద్రలేచి చూసేసరికి కనపించలేదు. దీంతో బైకుల యజమానులు ఇద్దరు పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చోరీ అయిన బైకుల విలువ సుమారు రూ.1.70 లక్షలు కాగా, కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై సైదుబాబు తెలిపారు.
● రూ.1,09,910 నగదు స్వాధీనం
పెద్దారవీడు: మండల పరిధిలోని రేగుమానిపల్లి గ్రామం సమీపంలో పేకాట శిబిరంపై పెద్దారవీడు. పెద్దదోర్నాల ఎస్సైలు వి.సాంబశియ్య, వి.మహేష్ సంయుక్తంగా తమ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పెద్దారవీడు ఎస్సై మాట్లాడుతూ.. పేకాట స్థావరంలో కోతముక్క ఆడుతున్న 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద రూ.1,09,910 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను మార్కాపురం ఏజేఎఫ్‌సీ కోర్టు మేజిస్ట్రేట్ ఎం.బాలాజీ ఎదుట హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ 300 జరిమానాతోపాటు 2 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారని వివరించారు.
ఒంగోలు సిటీ: గ్రంథాలయ ఉద్యోగులకు 010 కింద వేతనం చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఒంగోలు గ్రంథాలయ కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీటీ తాగుతూ మాట్లాడుకుందాంశ్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు టౌన్ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, డాక్టర్ మానస, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జీవీ శివారెడ్డి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ సుబ్బారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.భాస్కర రావు, జిల్లా మహిళా కన్వీనర్ డి.ధనమ్మ, గ్రంథాలయ సంస్థ పెన్షనర్ వింగ్ అధ్యక్షుడు డీవీ సుబ్బారెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: రైల్వే ఉద్యోగులంతా అంబేడ్కర్ ఆలోచనా విధానంతో ఐక్య పోరాటాలు చేయాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ సెక్రటరీ దాశరధి కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణ పాల్గొని ప్రసంగించారు. అంబేడ్కర్ ఒక నాయకుడు మాత్రమే కాదని, విశ్వమానవుడని, శ్రామికుల వేతనం కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలో హక్కులు కల్పించారని చెప్పారు. అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం రైల్వేలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పోరాటాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ ప్రెసిడెంట్ అంగడి వినోద్, సాయిబాబా, గూటలా పాపారావు, బీవీ నాయక్, విజయరాజు, గంగపట్నం శ్యామ్ సుందర్ నాయక్, దాసరి శ్రీకాంత్, చింతా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ న్యాయవాదిగా శ్రీకాంత్

ప్రభుత్వ న్యాయవాదిగా శ్రీకాంత్