
నేడు కొనకనమిట్లలో కోటి సంతకాల సేకరణ
నేడు కొనకనమిట్లలో కోటి సంతకాల సేకరణ
తాళ్లూరు: సాగర్ కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. ఈ సంఘటన తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం పంచాయితీ రెడ్డి సాగర్ ఓబీసీ కెనాల్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామానికి చెందిన మెలిక ప్రసాద్(40) తన భార్య కొండమ్మతో కలిసి చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటాడు. రోజూమాదిరిగానే సాగర్ కాలువలో చేపలు పట్టేందుకు వల వేశౠరు. నీటిలో నుంచి వల బయటకు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వల కాలుకు చుట్టుకోవడంతో పట్టుతప్పి కాలువలో పడి గల్లంతయ్యాడు. మెలిక ప్రసాద్(40)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రసాద్ మరణించి ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు తమ బంధువులతో కలిసి మృతదేహాం కోసం గాలిస్తున్నారు.

నేడు కొనకనమిట్లలో కోటి సంతకాల సేకరణ