
కొప్పోలు బ్రిడ్జి వద్ద ఒకవైన్ షాపులో నకిలీ బీరు
ఎక్సైజ్ సురక్ష యాప్‌లో ఎర్రర్ రావడంతో నకిలీ బీరుగా గుర్తించిన స్థానికులు
ఒంగోలు టౌన్: నగరంలో నకిలీ బీరు బాటిల్ కలకలం సృష్టించింది. నగర శివారులోని కొప్పోలులో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఒక వైన్ షాపులో మంగళవారం ఒక కస్టమర్ మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అనుమానం వచ్చిన అతడు ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షించాడు. తొలుత మాన్షన్ హౌస్ లిక్కర్ తీసుకొని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా మద్యం బాటిల్ వివరాలు వచ్చాయి.
ఆ తరువాత బీర్ బాటిల్ మీద ఉన్న క్యూ ఆర్ కోడ్‌కు స్కాన్ చేశాడు. ఎర్రర్ అని వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసిన సదరు కస్టమర్ ఒంగోలులోని వైన్ షాపుల్లో నకిలీ బీర్ విక్రయిస్తున్నారని, మందుబాబులు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. నకిలీ బీరు తాగుతున్నామంటూ మందుబాబులు ఆందోళనకు గురయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌లో కేవలం నకిలీ లిక్కర్‌ను మాత్రమే గుర్తించే సౌకర్యం ఉందని, బీరు బాటిళ్లను గుర్తించే సౌకర్యం లేదని ఎక్సైజ్ ఈఎస్ షేక్ ఆయేషా బేగం తెలిపారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌ను కేవలం లిక్కర్ బాటిళ్ల స్కానింగ్‌కు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. బీరు బాటిళ్ల మీద కంపెనీకి చెందిన క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, ప్రభుత్వ యాప్‌కు దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు.

🚨 Public Alert! Be Cautious! 🚨
A shocking incident has come to light at Koppole Road, Ongole.
At Sai Wines, when people scanned the Mansion House QR code, it worked successfully but when they scanned a beer bottle, the code showed an error on the official AP consumer website.… pic.twitter.com/uTOsi9ilqc— VoiceOfAndhra (@VoicesOfAndhra) October 14, 2025