
రోల్ ఆఫ్ పప్పెట్రీ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్‌పై శిక్షణ
ఒంగోలు సిటీ: సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల నుంచి ఎన్‌సీఈఆర్టీ ద్వారా ఎంపిక చేసిన 68 మంది ఉపాధ్యాయులకు రోల్ ఆఫ్ పప్పెట్రీ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్‌పై శిక్షణ శిబిరం ఢిల్లీలో నిర్వహించారు. గత నెల 10 నుంచి 24 వరకు జరిగిన ఈ శిక్షణలో రాష్ట్రం నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు పాల్గొనగా మన జిల్లా నుంచి నాగులుప్పలపాడు మండలానికి చెందిన వై మంజుల పాల్గొన్నారు. సృజనాత్మక బోధనా పద్ధతులను అభివృద్ధి చేయడంపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో పాల్గొన్న వారికి ఎన్‌సీఆర్టీ డైరెక్టర్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.