
దుర్గతి నాశిని..సద్గతి దాయని
న్యూస్‌రీల్
నేటి నుంచి జిల్లాలోని అన్ని గ్రానైట్ ఫ్యాక్టరీలు బంద్
ఏఎంఆర్ సంస్థకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందని ఆరోపణలు
ఈ నిర్ణయంతో ఆర్థికంగా కుదేలవుతామంటున్న యజమానులు
ప్రభుత్వ చర్యలపై యజమానుల ఆగ్రహం
ఎన్నికల ముందు లోకేష్ ఇచ్చిన హామీలు గాలికి
ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఫ్యాక్టరీలను తెరిచే పనేలేదు
అధికారులతో ఒప్పందాన్ని 9వ తేదీకి వాయిదా వేసుకున్న ఏఎంఆర్ సంస్థ
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
రామతీర్థంలోని గ్రానైట్ క్వారీ, గ్రానైట్ రాళ్ళు
గ్రానైట్ పరిశ్రమలను ఆదుకుంటామని యువగళం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన గ్రానైట్ పరిశ్రమల యజమానుల సదస్సులో నారా లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలు మరిచారు. అంతంత మాత్రంగా ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల మనుగడనే ప్రశ్నార్ధకరంగా మార్చేలా ప్రైవేటు పెత్తనానికి పచ్చజెండా ఊపింది చంద్రబాబు సర్కార్. దీనిపై పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నష్టాల పాలవుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు పెత్తనాన్ని సహించబోమంటూ బుధవారం నుంచి పరిశ్రమలు మూసివేతకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం న్యాయం చేసే వరకూ ఫ్యాక్టరీలు తెరవబోమని తెగేసి చెబుతున్నారు.
దుష్ట సంహారిణి..శిష్ట రక్షణిగా లోకాలను కాపాడే ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవిని శరన్నవరాత్రులలో భక్తులు దుర్గాష్టమి రోజున ప్రత్యేకంగా అలంకరించి అర్చించారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం కూడా కలసిరావడంతో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
– సాక్షి, ఒంగోలు