
అంగన్‌వాడీ సిబ్బంది విధుల నుంచి తొలగింపు
కంభం: మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఈనెల 8వ తేదీ అదృశ్యమై 10వ తేదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పొదిలి లక్షిత్ మృతికి పరోక్షంగా అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఒక కారణమని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల పీడీ సువర్ణ విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పించిన నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్ కె.గోవిందమ్మ, ఆయా ఎ.కృష్ణకుమారిని విధుల్లో నుంచి తొలగిస్తూ బుధవారం కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాగా ఆ ఉత్తర్వులను సిబ్బందికి అందజేసినట్లు సూపర్ వైజర్ గాలెమ్మ తెలిపారు.
బాలుడి మృతి కేసు
దర్యాప్తులో లేని పురోగతి:
బాలుడు మృతి చెంది వారం రోజులు కావస్తున్నా కేసులో ఎటువంటి పురోగతి లేనట్లు తెలుస్తోంది. ముక్కుపచ్చలారని బాలుడి అనుమానాస్పద మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో మృతికి కారకులైన వారిని పోలీసులు త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని బాలుడి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు.