
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శ్యామల
బేస్తవారిపేట: హనుమాన్ జయంతి సందర్భంగా బేస్తవారిపేట మండలంలోని సలకలవీడు గ్రామంలో అభయ వీరాంజనేయస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష పూజలు, సువర్చ సహిత ఆంజనేయస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. తొలుత ఆమెకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త బిక్కా రామాంజనేయరెడ్డి, గ్రామస్తులు ఘనస్వాగతం పలికి సన్మానించారు.
కుక్కల దాడిలో
జింక మృతి
టంగుటూరు: అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన జింకను కుక్కలు వేటాడి చంపేశాయి. ఈ సంఘటన టంగుటూరు మండలంలోని జమ్ములపాలెం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామ శివారులో జింకను నాలుగు కుక్కలు దాడి చేస్తున్న సమయంలో స్థానికులు గమనించి తరమికొట్టారు. అప్పటికే జింక మృతి చెందింది. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
రైల్వే స్టేషన్లో గంజాయి విక్రేత అరెస్టు
● 1.7 కేజీల గంజాయి స్వాధీనం
ఒంగోలు టౌన్: ౖరెల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న కేరళకు చెందిన వ్యక్తి నుంచి రైల్వే పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జీఆర్‌పీ పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు రైల్వే స్టేషన్ మూడో నంబర్ ప్లాట్‌ఫారంపై గురువారం సాయంత్రం ఓ వ్యక్తి చేతిలో గ్రే కలర్ సంచితో అనుమానాస్పదంగా తిరగడాన్ని పోలీసులు గమనించారు. అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 1.7 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసుల దర్యాప్తులో సదరు వ్యక్తి కేరళకు చెందిన ఎస్‌ఆర్ విజయ్‌గా తేలింది. గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. తనిఖీలో జీఆర్‌పీ ఎస్సై మధుసూదనరావు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శ్యామల

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శ్యామల