
అందనంత దూరం..!
జిల్లాలో మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. భూగర్భ జలాలు అందనంత దూరానికి చేరుకున్నాయి. లోతైన బోర్లు వేసినా ఉపయోగం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 95 గ్రామాల్లో కొత్తగా బోర్లు వేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అధికారికంగా 17 మండలాలు కరువు ప్రాంతాల జాబితాలోకి ఎక్కాయి. ఇంకా అనేక ప్రాంతాల్లో నీటి సమస్యతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలాంటి దుస్థితి దాపురించడంతో రైతులు, ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. అధికారులు, పాలకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు.
జలం..
● జిల్లాలో పాతాళానికి పడిపోయిన గంగ
● అట్టడుగుకు చేరిన భూగర్భ జలాలు
● జిల్లాలోని 95 గ్రామాల్లో కొత్త బోర్ల నిషేధం
● మంచినీటికి డేంజర్ బెల్స్
జిల్లాలోని మండలాల్లో గత మూడు నెలల్లో భూగర్భ జలాలు (మీటర్లలో)
మండలం జనవరి ఫిబ్రవరి మార్చి
మార్కాపురం 18.00 20.84 26.99
యర్రగొండపాలెం 32.63 46.48 47.76
అర్థవీడు 7.76 8.88 9.30
బేస్తవారిపేట 9.06 10.56 14.13
సీఎస్ పురం 8.39 8.78 9.72
చీమకుర్తి 12.57 10.19 11.72
కంభం 11.37 13.54 15.07
దర్శి 6.79 8.70 11.02
దొనకొండ 22.81 24.50 25.54
దోర్నాల 50.11 62.75 66.95
గిద్దలూరు 31.50 38.84 50.45
హనుమంతునిపాడు 7.69 6.81 7.17
జరుగుమల్లి 3.52 3.66 4.03
కనిగిరి 7.27 7.46 7.94
కొమరోలు 8.50 8.46 11.44
కొనకనమిట్ల 9.18 11.05 14.20
కొండపి 3.59 3.75 4.11
కొత్తపట్నం 1.99 2.28 2.66
కురిచేడు 3.88 4.34 4.74
మర్రిపూడి 6.40 6.42 6.91
ముండ్లమూరు 6.26 7.12 8.10
ఎన్‌జీ పాడు 1.58 1.78 2.12
ఒంగోలు 3.27 3.57 4.44
పీసీ పల్లి 5.00 8.03 4.49
పామూరు 7.73 4.22 8.48
పెద్దారవీడు 27.28 32.20 38.17
పొదిలి 4.94 5.53 6.60
పొన్నలూరు 6.74 6.51 6.91
పుల్లలచెరువు 30.57 33.63 34.86
రాచర్ల 12.68 27.68 32.75
ఎస్‌ఎన్ పాడు 2.55 3.04 3.57
తాళ్లూరు 6.02 6.36 7.03
తర్లుపఠాడు 13.34 16.49 24.34
త్రిపురాంతకం 18.07 19.07 20.58
వెలిగండ్ల 6.74 7.03 7.44