
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న పేరయ్య
ఒంగోలు టౌన్: మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయడం ఎంత అవసరమో మెదడు సక్రమంగా పనిచేయడానికి పుస్తక పఠనం అంత అవసరమని విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి.పేరయ్య అన్నారు. జిల్లా గ్రంథాలయంలో ఆదివారం ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలతో మర్యాద రామన్న, రాబిన్ హుడ్ కథలను చదివించారు. పొదుపు కథలు అడిగి సమాధానాలను రాబట్టారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకున్న వారికి పుస్తకాలు చదవడం ఉపకరిస్తుందని ఉప గ్రంథాలయ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు గ్రూప్–1, గ్రూప్–3 పరీక్షలపై మార్కాపురానికి చెందిన భానోదయ స్టడీ సర్కిల్ నిర్వాహకులు అవగాహనా తరగతి నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది కె.సంపూర్ణమ్మ, యం.శ్రీనివాసులు, ఎస్.అనిల్ బాబు, టి.గోవిందమ్మ పాల్గొన్నారు.