
సంఘటన స్థలంలో మృతి చెందిన గొర్రెలు
కొత్తపట్నం: కారు ఢీకొట్టడంతో 37 గొర్రెలు మృతి చెందగా, మరో 7 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన కొల్లుబోయిన సోమయ్యకు 60 గొర్రెలున్నాయి. ప్రతిరోజూ పొలం తీసుకెళ్లి వాటిని మేపుకుని వస్తుంటాడు. రోజూ మాదిరిగానే ఆదివారం కూడా పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో సాయంత్రం వేళ అల్లూరులోని చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ప్రమాదం జరిగింది.
కొత్తపట్నం నుంచి ఒంగోలు వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 37 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 7 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. వాటి విలువ రూ,7 లక్షలు ఉంటుందని బాధితుడు సోమయ్య తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎస్సై బి.సాంబశివరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కారులో 9 మంది యువకులు ఉన్నారని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.