
స్పెల్‌బీ టెస్టుకు హాజరైన విద్యార్థులు
ఒంగోలు: ‘సాక్షి’ స్పెల్‌బీ సెకండ్ లెవల్ పోటీలు ఆదివారం స్థానిక క్విస్ ఉన్నత పాఠశాలలో ఉత్సాహంగా జరిగాయి. ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్ వ్యాపి, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లు వ్యవహరిస్తున్న ఈ పోటీలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. పోటీలను క్విస్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాజు, ఏవో స్వాతి, ‘సాక్షి’ అడ్వర్టయిజ్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శర్మ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అడ్వర్టయిజ్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శర్మ మాట్లాడుతూ ఇటీవల ప్రిలిమినరీ పోటీలు ముగిశాయన్నారు. ప్రస్తుతం జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్‌లో విజేతలైన వారికి సెమీ ఫైనల్ పోటీలు విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, విజయవాడలలో జరుగుతాయని చెప్పారు. సెమీఫైనల్ విజేతలకు హైదరాబాద్‌లో ఫైనల్ పోటీలు నిర్వహిస్తారన్నారు. స్పెల్‌బీ ఆవశ్యకతను గుర్తించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహిస్తున్న తీరు సంతోషంగా ఉందని చెప్పారు.

స్పెల్‌బీ

మాథ్స్‌బీ