
మార్కాపురం రూరల్: గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన అందుతోందని.. సచివాలయ వ్యవస్థ సీఎం జగన్ కలల ప్రాజెక్టు అని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని గజ్జలకొండ గ్రామ పంచాయతీలో నూతనంగా రూ.80 లక్షలతో నిర్మించిన సచివాలయం–1, 2 భవనాలు, రూ.43.60 లక్షలతో నిర్మించిన రెండు రైతు భరోసా కేంద్రాలు ఆదివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సేవలు, సంక్షేమ సేవలను ఒకేచోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేశారన్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి సేవలు లేవని జెడ్పీచైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, ఎంపీపీలు పోరెడ్డి అరుణా చెంచిరెడ్డి, తర్లుపాడు ఎంపీపీ భూలక్ష్మీ రామసుబ్బారెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు శ్రీనివాసరెడ్డి, కుందురు మల్లారెడ్డి, కవలకుంట్ల పేతురు, మాజీ ఎంపీటీసీ గాయం నాగేందర్‌రెడ్డి, సచివాలయ కన్వీనర్ నాయుడుపల్లి శ్రీనివాసరెడ్డి, కొలగట్ల శివారెడ్డి, ఎల్ శేఖర్, పంచాయతీరాజ్ డీఈ కే ఆదినారాయణ, ఎంపీడీవో తోట చందన, పంచాయతీరాజ్ ఏఈ మోహన్‌రాజ్, ఏఓ శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ప్రతాపరెడ్డి, ఏపీఎం రమేష్‌బాబు, పశువైద్యాధికారి భాస్కర్‌రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, గ్రామ పార్టీ నాయకులు ఓబులరెడ్డి, అచ్చిరెడ్డి, గాలిరెడ్డి పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి, ఎమ్మెల్యే కేపీ గజ్జలకొండలో రెండు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం