యర్రగొండపాలెం: బాబుగారికి తోడుగా కార్యక్రమం జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోందని పచ్చమీడియా చేస్తున్న ప్రచారమంతా బోగస్ అని తేలింది. యర్రగొండపాలెం శిబిరంలో శనివారం దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలే అందుకు నిదర్శనంగా నిలిచాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంతో ప్రజాధనాన్ని దోచుకుని రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు కోసం టీడీపీ తలపెట్టిన బాబుగారికి తోడుగా కార్యక్రమంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేయాల్సి ఉంది. కానీ, స్థానిక యూనియన్ బ్యాంకు ఎదురుగా ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఉదయం 11 గంటల తర్వాత ఎవరూ లేకపోవడం పచ్చమీడియా బూటకపు ప్రచారాన్ని బట్టబయలు చేసింది.