మనసును పులకింపజేసే ప్రకృతి అందాలు.. గాండ్రించే పులులు.. వివిధ రకాల వణ్యప్రాణులు.. అరుదైన వృక్షజాతులకు నెలవైన నల్లమల అభయారణ్యం రా రమ్మని పిలుస్తోంది. పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకునే విధంగా అత్యాధునిక వసతులు, రోబోటిక్ మ్యూజియం, విద్యుత్ దీపాలంకరణలు హైలెట్‌గా మారనున్నాయి. స్వేచ్ఛగా సంచరించే పులులు, ఎలుగుబంటి, జింకలు, దుప్పులు, హైనా, నెమళ్లతో పాటు 70 రకాల క్షీరదాలు, సరీసృపాలు జీపుల్లో ప్రయాణించే పర్యాటకులకు సరికొత్త అనుభూతులు పంచనున్నాయి. పులుల ప్రత్యుత్పత్తి సమయంలో వాటి ఏకాంతం కోసం మూడు నెలలు మూతపడిన జంగిల్ సఫారీ ఆదివారం నుంచి తెరుచుకోనుంది. ఇంకెందుకాలస్యం.. నల్లమలను చుట్టొచ్చేద్దాం పదండి...