
గిరిజన కాలనీలో మాట్లాడుతున్న విశ్రాంత ఐఏఎస్ విజయ్‌కుమార్
ఉలవపాడు: తల్లితండ్రులు పిల్లలను ఎంత కష్టమైనా బాగా చదివించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎస్‌ఆర్‌కే విజయ్‌కుమార్ అన్నారు. మండలపరిధిలో ఆయన ఐక్యతా విజయపథం పాదయాత్ర నిర్వహించారు. రామాయపట్నం నుంచి ప్రారంభమై పెదపట్టపుపాలెం, చాకిచర్ల, చాగల్లు, రాజుపాలెం. భీమవరం గ్రామం వరకు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ చదువు వలన మాత్రమే కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. చదువు వల్ల ఉద్యోగం మాత్రమే కాకుండా ఎలాంటి వ్యాపారాలు చేయాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా ఉపయోగపడుతుందన్నారు. ప్రధానంగా ఎస్టీ కాలనీలలో విద్యకు దూరంగా ఉన్నారన్నారు. వారు తమ పిల్లలను పాఠశాలకు పంపాలన్నారు. తాను కలెక్టర్‌గా ఉన్నప్పుడు కూడా విద్యపై దృష్టి కేటాయించినట్లు తెలిపారు. వైద్యశాలలో ప్రసవం జరిగేలా చూడాలని తెలియచేశారు. దీని వలన తల్లిబిడ్డకు మేలు జరుగుతుందన్నారు. పూర్తిస్థాయిలో నిధులు లేక పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయని, వాటి గురించి అందరూ ఐకమత్యంగా ఉండి సాధించుకోవాలని తెలియచేశారు. ఆయన వెంట నాయకులు చంద్రశేఖర్, బ్రహ్మయ్య, వెంకటరావు, హరినారాయణ, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత ఐఏఎస్ అధికారి
విజయ్‌కుమార్