
కరెన్సీ నోట్లతో అలంకరణలో వినాయకుడు
● రూ.15 లక్షల కొత్త కరెన్సీ నోట్ల అలంకరణలో వినాయకుడు
ఒంగోలు మెట్రో: ఒంగోలు గద్దలగుంటపాలెం రాజా పానగల్ రోడ్డులో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా వినాయకుడికి రూ.15 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో గణనాథుని ప్రత్యేకంగా అలంకరించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవరావు, వేమూరు బుజ్జి, చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకా దేవి, ఓం శ్రీ హరి నారాయణ భక్త బృంద సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.