
ఒడ్డుకు చేరిన మహిళలతో మాట్లాడుతున్న మైరెన్ ఎస్సై సుబ్బారావు, పోలీసులు
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ముందు బంధువుల
ఆందోళన
గిద్దలూరు రూరల్: పట్టణంలోని ఏరియా వైద్యశాలలో గురువారం మగ శిశువు మృతి చెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పుట్టిన బిడ్డ మృతి చెందాడని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అంబవరం గ్రామానికి చెందిన హసీనా అనే మహిళకు గురువారం ఉదయం వైద్యులు ఆపరేషన్ చేసి మగశిశువును బయటకు తీశారు. అయితే బయటకు తీసిన వెంటనే ఆ మగ శిశువు మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే మగ శిశువు మృతి చెందాడని బంధువుల వైద్యశాల ముందు బైఠాయించి నిరసనకు దిగారు. మూడు రోజుల నుంచి ఆస్పత్రిలోనే ఉన్నామని, వైద్యులు సరిగ్గా పట్టించుకోలేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడి సర్దిచెప్పారు. దీనిపై వైద్యశాల సూపరింటెండెంట్ సూరిబాబును వివరణ కోరగా..బిడ్డ ఉమ్మనీరు తాగడం వల్లే మృతి చెందాడని చెప్పారు. వైద్య సేవల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేదన్నారు. శిశువు తల్లిదండ్రులకు, బంధువులకు అవగాహన లేక ఆందోళన చేపట్టారని తెలిపారు.
విద్యుదాఘాతానికి మహిళ మృతి
కొత్తపట్నం: విద్యుదాఘాతానికి మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని రంగాయపాలెంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..అల్లూరుకు చెందిన సామంతుల నాగలక్ష్మి(35) వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం రంగాయపాలెంలో వేరుశనగ మండీలు పీకేందుకు గ్రామానికి చెందిన కొంత మంది కూలీలతో కలిసి ఆటోలో వెళ్లారు. పొలంలో ఉన్న 20 అడుగుల అల్యూమినియం స్ప్రింక్లర్ పైప్‌ను తీసుకొని కొలతలు వేస్తున్నారు. ఆ పైప్ 11 కేవీ లైన్‌కు తలగడంతో నాగలక్ష్మి విద్యుత్ షాక్‌కు గురై పడిపోయింది. వెంటనే తోటి కూలీలు ఆటోలో కొత్తపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. తల్లి చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న పిల్లలు విలపించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
● వాడరేవు తీరంలో నలుగురు మహిళలు గల్లంతు
● వేగంగా స్పందించి రక్షించిన మైరెన్ పోలీసులు
చీరాల టౌన్: వాడరేవు సముద్ర తీరంలో గురువారం సాయంత్రం గణేశ్ నిమజ్జన సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మైరెన్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో నలుగురు మహిళలు ప్రాణాలతో ఒడ్డుకు చేరారు. మైరెన్ ఎస్సై పసుపులేటి సుబ్బారావు కథనం మేరకు.. చిలకలూరిపేటకు చెందిన 50 మంది భక్త బృందం గణేశుడి నిమజ్జనం కోసం వాడరేవు తీరానికి వచ్చారు. విగ్రహ నిమజ్జన అనంతరం సముద్ర స్నానం చేస్తుండగా బృందంలోని నలుగురు మహిళలు అలల తాకిడికి కొట్టుకుపోయారు. సమీపంలోనే ఉన్న మైరెన్ పోలీసులు సైకం ప్రసాద్, ఎస్.చిరంజీవి, ఎ.నరేష్, హోంగార్డు పోతురాజు వేగంగా స్పందించి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి గల్లంతవుతున్న నలుగురు మహిళలను రక్షించారు. సముద్రం నీరు తాగిన మహిళలకు ప్రథమ చికిత్స చేసి బంధువులకు అప్పగించారు. మెరుపు వేగంతో స్పందించి మహిళలను కాపాడిన పోలీసులను బంధువులతో పాటుగా ఎస్పీ వకుల్ జిందాల్, మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు.

మృతి చెందిన శిశువు

మృతురాలు నాగలక్ష్మి(ఫైల్)