
విమాన రన్‌వే ప్లాన్‌ను పరిశీలిస్తున్న ప్రత్యేక బృందం
సింగరాయకొండ(టంగుటూరు): సింగరాయకొండ మండల పరిధిలో జాతీయ రహదారిపై సుమారు 6.4 కిలోమీటర్ల మేర కేంద్ర ప్రభుత్వం నిర్మించిన అత్యవసర విమాన రన్‌వే(ఎయిర్ స్ట్రిప్)ను బుధవారం ఎయిర్‌ఫోర్స్ కమాండర్ సి.ప్రదీప్ పిళ్లైతో కూడిన ప్రత్యేక బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు తగిన సూచనలు చేశారు. రన్‌వేకు ఇరువైపులా ఉన్న 132 కేవీ విద్యుత్ స్తంభాలను తొలగించి అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. రన్‌వేకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. రన్‌వే అప్రోచ్ రోడ్డు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని వేగంగా సేకరించాలని, త్వరితగతిన నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ దేవేష్ గోయల్, సైట్ ఇంజినీర్ ఆదిత్య, రెసిడెంట్ ఇంజినీర్ ఆర్.సతీష్, హైవే ఇంజినీర్ పి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
హైవే అధికారులకు ఎయిర్‌ఫోర్స్ బృందం సూచనలు