ఒంగోలు సబర్బన్: హౌస్ వైరింగ్‌లో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్‌సెట్ డైరెక్టర్ పి.ప్రతాప్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి 30 రోజులపాటు పురుషులకు హౌస్ వైరింగ్‌లో శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు శిక్షణకు అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో రావాలని సూచించారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సౌకర్యం ఉచితంగా కల్పిస్తామని వెల్లడించారు. వివరాలకు 94925 83484ను సంప్రదించాలని సూచించారు.