
స్పిల్ వే గేట్ల మరమ్మతుల కొత్తవి ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పిల్ వే గేట్ల మరమ్మతులు, లేదా వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయటానికి నూతనంగా రూ.9.40 కోట్లు మంజూరు చేసింది. ప్రధానంగా 12 గేట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయటానికి ఉద్దేశించి ఈ నిధులు విడుదల చేశారు. పరిపాలనా పరమైన అనుమతులు వచ్చాయి. త్వరలో టెక్నికల్ సాంక్షన్ వస్తుంది. వచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియను ప్రారంభించి కనీసం ఒక నెల రోజుల లోపే పనులు ప్రారంభించేందుకు పూనుకుంటాం. కొట్టుకుపోయిన మూడో గేటును బయటకు తీసే ప్రక్రియను ప్రారంభించాం. ప్రాజెక్టులోని నీరు వృథాగా బయటకు పోయే వీలు లేకుండా చర్యలు తీసుకున్నాం.
– సౌధాఘర్ అబుతలీం, ఎస్.ఈ, జిల్లా జలవనరుల శాఖ ప్రాజెక్టుల విభాగం