
చింతాయగారిపాలెంలో వృద్ధురాలికి ప్రభుత్వ పథకాల లబ్ధిపత్రాన్ని అందజేస్తున్న బాలినేని
ఒంగోలు రూరల్ (నాగులుప్పలపాడు): సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందడంతో పాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు రూరల్ మండలం చింతాయగారిపాలెం, పెద్ద దేవరంపాడు గ్రామాల్లో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలినేనికి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధికారుల సహకారంతో చాలా వరకు అక్కడికక్కడే బాలినేని పరిష్కారం చూపారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఉప్పు కొఠార్లకు వెళ్లే రోడ్లను మన ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో చేయగలిగామని గ్రామస్తులకు వివరించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనను నేరుగా ప్రజల వద్దకు తీసుకొచ్చి పరిపాలనను గ్రామాల్లోకే తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికే దక్కిందని తెలిపారు. భవిష్యత్‌లో మనందరం జగనన్నకు తోడుగా ఉండాలని కోరారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ను పరిశీలించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకోవడంతో పాటు బీపీ, షుగర్ వంటి పరీక్షలు స్వయంగా చేయించుకున్నారు. కార్యక్రమంలో ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల ఎంపీపీలు పల్లపోలు మల్లికార్జున్ రెడ్డి, నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చుండూరి రవి, మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మారెళ్ళ బంగారు బాబు, వారా వీర్రాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, గ్రామ సర్పంచ్ నాయుడు శ్రీరాములు, కరవది పీఏసీఎస్ అధ్యక్షుడు వాకా కృష్ణారెడ్డి, పోలినేని కోటేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, పీ పవన్ కుమార్, ఘట్టమనేని అశోక్, చప్పిడి సోమశేఖర్, మన్నే శ్రీనివాసరావు, ఈదర చిన్నారి, వడ్లమూడి మురళి, బ్రహ్మయ్య, వెంకట సుబ్బయ్య ఉన్నారు.
ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చింతాయగారిపాలెం, పెద దేవరంపాడు గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం