చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ‍ధ్వజం | YSRCP Chief YS Jagan Serious Comments On Chandrababu Govt In Meeting With Prakasam Leaders | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ‍ధ్వజం

Dec 11 2024 1:26 PM | Updated on Dec 11 2024 4:07 PM

YSRCP YS Jagan Serious Comments On CBN Govt

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే, చంద్రబాబు వచ్చాడు.. బాదుడే బాదుడు మొదలైందని వ్యాఖ్యలు చేశారు.

నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌ పార్టీ నేతలతో మాట్లాడుతూ.. ‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోంది. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తాం. చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు.. గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: అంతా వాళ్లే చేస్తున్నారు: వైఎస్‌ జగన్‌

 

బాబు బాదుడు షురూ..
చంద్రబాబు వచ్చాడు.. బాదుడే బాదుడు మొదలైంది. కరెంటు బిల్లులు చూస్తే షాక్‌లు తగులుతున్నాయి. రూ.15వేట కోట్లకుపైగా ఛార్జీలు పెంచాడు. గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్స్‌లు వేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు సంపద సృష్టి అంటే.. బాదుడే బాదుడు. రామాయపట్నం పోర్టు దశాబ్దాల కల. దాన్ని కట్టింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. వైఎస్సార్‌సీపీ హాయాంలో దాదాపుగా పూర్తైంది.. షిప్‌లు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఐదేళ్లలో నాలుగు పోర్టులు కట్టడం మొదలైంది. ఇప్పుడు వాటిని శనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నాడు. మెడికల్ కాలేజీల రూపంలో, పోర్టుల రూపంలో మనం సంపద సృష్టించాం. వీటిని పద్దతి ప్రకారం అమ్మే కార్యక్రమం పెట్టాడని మండిపడ్డారు.

 

చంద్రబాబు అబద్ధాలు, మోసాలు పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు

అలాగే, వెలిగొండ రెండు టన్నెల్స్‌ పూర్తి చేశాం. ఆర్‌ అండ్‌ అర్‌ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంది. మనం అధికారంలో ఉండి ఉంటే అక్టోబరులో నీళ్లు నింపేవాళ్లం. అయిపోయిన ఈ ప్రాజెక్టుకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కూడా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. మార్కాపురంలో మనం మెడికల్‌ కాలేజీని దాదాపుగా పూర్తి చేశాం. ఇప్పుడు దీన్ని కూడా అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే మనమంతా కూడా పోరుబాటు పట్టాల్సిందే. ఈనెల 13న రైతు సమస్యలపైన కార్యక్రమం పెట్టాం. కరెంటు ఛార్జీలపైన ఈనెల 27న కార్యక్రమం పెట్టాం. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం జనవరి 3న కార్యక్రమం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఎల్లో మీడియాతో యుద్ధమే..
చంద్రబాబుతోనే మనం యుద్ధం చేయడం లేదు. ఎల్లో మీడియాతోనూ పోరాటం చేస్తున్నాం. ప్రతీ రోజూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. వీళ్లు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బురద చల్లడమే పనిగా పెట్టుకున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు చెప్పడం, వక్రీకరణ చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. పార్టీలో ప్రతీ ఒక్కరికీ సోషల్‌ మీడియా ఖాతా ఉండాలి. అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలి’ అని సూచనలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement