
సాక్షి, పశ్చిమ గోదావరి: చంద్రబాబు హయాంలో దోచుకో దాచుకో అన్న తీరుగా పాలన సాగిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ జన్మభూమి కమిటీలను చూసి ప్రజలు భయపడేవారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజలను ఎలా ఏమార్చాలి, ఎలా గద్దె నెక్కి డబ్బులను దోచుకోవాలో చూస్తుంటాడని మండిపడ్డారు.
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని, అందుకోసం ఇప్పటికే మూడు విడతల్లో రూ.19 వేల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. సీఎం జగన్ వచ్చాక వాలంటీర్ వ్యవస్థతో గడప వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం విద్యలో 14 స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 2వ స్థానంలో ఉందన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి కారుమూరి అన్నారు.
చదవండి: అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం.. వినూత్న నిరసన