
తాడేపల్లి : ఏపీలో పలు మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ చంద్రబాబు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేసి తన తాబేదారులుకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీ లను ప్రయివేటు పరం చేయటం దుర్మార్గమైన చర్య అంటూ విమర్శించారు.
తాను అవినీతి చేసినట్లు ఎల్లో మీడియా వార్తలు రాసిందని, ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే బ్యాచ్ బీఆర్ నాయుడు, రాధాకృష్ణ, ఈనాడు కిరణ్ అని ఆరోపించారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 5వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. తన మీద విజిలెన్స్ అంటూ నానా హడావుడి చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు అంబటి. ఒకవేళ అరెస్టు చేసినా భయపడేది లేదన్నారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో కూడా విచారణ చేస్తున్నారని, తనపై మరో కేసు పెట్టడానికి రెడీ చేస్తున్నారన్నారు.
ఏదైనా న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటానన్నారు. లోకేష్ బెదిరింపులకు భయపడే మనిషిని కాదని, యుద్ధానికి తాను సిద్ధమని అంబటి స్పష్టం చేశారు. తన కంఠం పెద్దదరి అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని, కిరణ్, బీఆర్ నాయుడు, రాధాకృష్ణ అవినీతి తిమింగళాలని విమర్శించారు.