వరంగల్ ఎన్నికలు: టికెట్‌ ఎవరికిచ్చినా ఓకే.. 

Warangal Municipal Corporation Election 2021: Mother, Daughter Filed Nominations - Sakshi

వరంగల్‌: వరంగల్‌ బల్దియా ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు టీఆర్‌ఎస్‌ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్లు భారీగానే దాఖలయ్యాయి. నామినేషన్ల గడువు ఆదివారంతో ముగిసింది. అయితే, చివరిరోజు పలు వార్డుల్లో తల్లీకూతుళ్లు నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్‌ ఎవరికి ఇచ్చినా ఇబ్బంది ఎదురుకావద్దనే భావనతోనే ముందస్తుగా ఇద్దరు చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్టు వారు చెప్పుకొచ్చారు.  

మాజీ కార్పొరేటర్‌ కేడల పద్మ 42వ డివిజన్‌ నుంచి, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ అదే డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్‌ నేత యోగానంద్‌ 41 డివిజన్‌ అభ్యర్థిగా, ఆయన సతీమణి కొల్లూరి స్వరూప 42 డివిజన్‌ నుంచి పోటీలో ఉన్నారు. 40వ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్ పార్జీ‌ తరపున గడ్డం యుగేందర్, ఆయన సతీమణి గడ్డం స్రవంతి నామినేషన్లు సమర్పించారు.

19వ డివిజన్‌ నుంచి నామినేషన్లు వేసిన తల్లి ఝాన్సీ, కుమార్తె మౌనిక 

గ్రేటర్ వరంగల్‌‌ ఫైట్‌: ఎవరు బరిలో నిలిచారో తెలుసా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top