ఏపీ బీజేపీలో టికెట్‌ వార్‌.. సీనియర్ల మధ్య సీటు పోటీ! | Sakshi
Sakshi News home page

ఏపీ బీజేపీలో టికెట్‌ వార్‌.. సీనియర్ల మధ్య సీటు పోటీ!

Published Thu, Jul 6 2023 8:33 PM

Visakha Ticket War Between Daggubati Purandeswari And GVL In AP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో బీజేపీ ఇద్దరు సీనియర్ల మధ్య టికెట్‌ వార్‌ నడుస్తోందా?. బీజేపీ హైకమాండ్‌ అక్కడ ఎవరికి టికెట్‌ ఇస్తుంది? అనే చర్చ కార్యకర్తలను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఒకవైపు, తమ నేతను కార్యకర్తలు హైలైట్‌ చేస్తుండగా.. మరొకరికి గతంలో అక్కడి నుంచి గెలిచిన రికార్డు ఉంది. దీంతో, టికెట్‌ ఎవరికి ఇస్తారనేది కమలం పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ వారద్దరూ ఎవరంటే..

విశాఖపట్నం నుంచి ఇద్దరు బీజేపీ సీనియర్ల మధ్య టికెట్‌ వార్‌ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కొన్నాళ్లుగా విశాఖలో గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జీవీఎల్‌ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో ఆయన అభిమానులు బర్త్‌ డే వేడుకలను ఘనంగా ప్లాన్‌ చేశారు. విశాఖ సిటీ మొత్తం "GVL 4 VIZAG" పోస్టర్లు అంటించారు. విశాఖ అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నట్లుగా అభిమానులు అందులో పోస్టర్లలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఇటీవల జీవీఎల్‌ కూడా విశాఖ అభివృద్ధిపైనే మాట్లాడుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో విశాఖలో టికెట్‌ ఆయన టికెట్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇక, ఏపీ బీజేపీకి కొత్తగా ప్రెసిడెంట్‌గా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీకి పట్టుదలగా ఉన్నారు. గతంలో పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈనేపథ్యంలో ఆమె కూడా విశాఖ సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ హై కమాండ్ కి విశాఖ సీటు అగ్ని పరీక్షగా మారుతుందని పొలిటికల్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో, ఎవరిని సీటు వరిస్తుందోనన్న సస్పెన్స్‌ చోటుచేసుకుంది. 

ఇది కూడా చదవండి: ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు: సజ్జల

Advertisement
 
Advertisement