
టీడీపీలో కొన్ని ఊర కుక్కలు ఉంటాయి. వాటిని చంద్రబాబే మేపుతూ.. బయటకు వెళ్లే వాళ్ల మీదకు..
ఎన్టీఆర్, సాక్షి: ధనికులు పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గణనీయమైన అభివృద్ధి చేశారని కితాబిచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. మంగళవారం విజయవాడ పార్లమెంటరీ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త హోదాలో తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారాయన.
చంద్రబాబు తన దగ్గర కొన్ని ఊర కుక్కల్ని పెట్టుకున్నారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లను విమర్శించడమే వాళ్ల పని. ఎవరిని ఎక్కువగా తిడితే వాళ్లకు పదవులు ఇస్తారు. అలాంటి వాళ్లే నన్ను చెప్పుతో కొడతా అన్నారు. ఆ మాటలు ప్రజలందరికీ తెలుసు. ఇలాంటివాళ్లు సమాజానికి మంచి చేస్తున్నారా? లేదా? అనేది చంద్రబాబు, నారా లోకేష్‌లనే అడగాలి. అందుకే అలాంటి వాళ్ల మాటల్ని పట్టించుకోను.
‘‘నారా లోకేష్ ఒక పనికి మాలినోడు. నారావారిపల్లెలో వాళ్ల తాతది తప్ప చంద్రబాబుకు సొంతిల్లు లేదు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఓడాక.. తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు’’ అని నాని సెటైర్లు వేశారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 5వేల కోట్లతో ఎలక్షన్ ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అందులో కమిషన్లు బాగా మిగులుతాయని హడావిడిగా చేశారు. ఏ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల గురించి చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదు అని ఆరోపించారు ఎంపీ నాని.