TVK : విజయ్‌ అరుదైన నిర్ణయం.. తన డ్రైవర్‌ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్‌ | Vijay announces former driver son as MLA candidate ahead of Tamil Nadu elections | Sakshi
Sakshi News home page

విజయ్‌ అరుదైన నిర్ణయం.. తన డ్రైవర్‌ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్‌

Mar 29 2026 6:49 PM | Updated on Mar 29 2026 6:59 PM

Vijay announces former driver son as MLA candidate ahead of Tamil Nadu elections

సాక్షి,చెన్నై: సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా పార్టీ అధినేతలు సామాన్యులకు కీలక పదవులు ఇచ్చి, తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. అందరి మన్ననలు పొందుతుంటారు. తాజాగా, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌ను విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు ప్రకటించారు.

ఆదివారం తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనున్న 234 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. అయితే, వేదికగా విజయ్‌ తనని ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరును ప్రకటించడంతో శబరినాథన్‌, ఆయన తండ్రి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. శబరీనాథన్ విజయ్ పాదాలను తాకి, ఆయనను ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో విజయ్ స్వయంగా అతని కన్నీళ్లను తుడిచారు. ఈ దృశ్యం అభిమానులను కదిలించింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ‘విజయ్ తన డ్రైవర్ కుమారుడిని రాజకీయ నాయకుడిగా నిలబెట్టడం విశ్వాసానికి నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు.

మరికొందరు ‘రాజేంద్రన్ 30 ఏళ్లుగా విజయ్‌తో ఉన్నాడు. అతని కుమారుడు శబరీనాథన్ అభిమాన సంఘం కార్యకలాపాల్లోనూ, సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నాడు’ అని వివరించారు. గత ఏడాది శబరీనాథన్‌ను విరుగంబాక్కం జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడం ద్వారా విజయ్ తన విశ్వాసపాత్రులపై నమ్మకం ఉంచినట్లు స్పష్టమైంది.

2024లో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తన పార్టీని ప్రకటించారు. ఆయన చివరి సినిమా ‘జన నాయకన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపై ఆయన పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి స్వయంగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ‘ప్రజలతో నిలబడే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేశాను’అని విజయ్ స్పష్టం చేశారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement