Munugodu By-Elections: Revanth Reddy Not Participated In Munugodu Padayatra Due To Corona Symptoms - Sakshi
Sakshi News home page

మునుగోడు పాదయాత్రకు రేవంత్‌రెడ్డి దూరం

Aug 13 2022 12:35 PM | Updated on Aug 13 2022 1:17 PM

TPCC Chief Revanth Reddy To Symptoms Of Corona - Sakshi

మునుగోడులో పాదయాత్రకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాలతో ఆయన సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు.

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడులో పాదయాత్రకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాలతో ఆయన సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా పరీక్షకు శాంపిల్స్‌ను పంపించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నారాయణపురం నుంచి చౌటప్పల్‌ వరకు కాంగ్రెస్‌  పాదయాత్ర చేపట్టింది.

ఇది ఇలా ఉండగా, చండూరు సభలో అద్దంకి దయాకర్‌.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చేసిన పరుష వ్యాఖ్యలు నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే తనకు గౌరవం ఉందన్నారు. తెలంగాణ సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన దయాకర్‌పై చర్యలు ఉంటాయన్నారు.

కాగా, మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. దీంతో అన్ని పార్టీలు ఉప ఎన్నికల కసరత్తును ప్రారంభించాయి.
చదవండి: రేవంత్‌ బహిరంగ క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్‌ ఏంటంటే.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement